Thursday, July 22, 2021
spot_img
HomeUncategorizedఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడో తెలుసా..?

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడో తెలుసా..?

మనదేశంలో ఒకే కాన్సులో ముగ్గురు జన్మిస్తే అబ్బో.. అని ఆశ్చర్యపోతాం.. కానీ ఒకే కాన్సులో ఐదుగురు జన్మించిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఓ మహిల ఒకే కాన్సులో ఏకంగా 10 మంది పిల్లల్ని కని రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాలో ఈ సంఘటన జరగగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

సౌత్ ఆఫ్రీకాలోని ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే రిటైల్ స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. గతంలో ఈమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. వారికి ప్రస్తుతం ఆరేళ్లు. ఆ తరువాత గర్భం దాల్చడంతో చాలా ఇబ్బందులు పడిందట. దీంతో డాక్టర్లు స్కానింగ్ తీయగా మొదట 7గురు జన్మిస్తారని తెలిపారు. మరోసారా స్కానింగ్ తీయగా 8 మంది పుడుతారని చెప్పారు.

అయితే 10 మందిలో అందరూ ఆరోగ్యంగానే ఉన్నా కొంత మందిని ఇంక్యూబెటర్లో పెట్టాల్సి వచ్చిందన్నారు. ఇక మే నెలలో మొరాకోకు చెందిన మహిల 9 మంది పిల్లలకు జన్మనివ్వగా ఇప్పుడు సితోలే ఆ రికార్డును అధిగమించారు. ప్రస్తుతం సితోలేకు 12 మంది పిల్లలు వారిని ఎలా సంరక్షిస్తారోనని అందరూ చర్చించుకుంటున్నారు.

అయితే స్కానింగ్ రిపోర్టులను అధిగమించి ఏకంగా 10 మంది పిల్లలకు జన్మినిచ్చింది సితోలే. వీరిలో 7గురు మగ పిల్లలుండగా.. ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఈ సందర్భంగా సితోలే మాట్లాడుతూ ప్రెగ్నేన్సీ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపింది. 8 మంది పిల్లు అని తెలియగా వీరిలో ఎంత మంది ఆరోగ్యంగా ఉంటారోనన్న ఆందోళన కలిగిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments