Friday, July 23, 2021
spot_img
HomeUncategorized‘కార్తీక దీపం’ నటించినందుకు శౌర్యకు రోజుకు ఎంతో తెలుసా..?

‘కార్తీక దీపం’ నటించినందుకు శౌర్యకు రోజుకు ఎంతో తెలుసా..?

ప్రతిరోజు సాయంత్రం 7.30 అయిందంటే చాలు.. ఇంట్లో ఉన్న ప్రతి మహిళ టీవీ ముందుకు రావాల్సిందే.. ఎందుకంటే ఆ సమయంలో ‘కార్తీక దీపం’ సీరియల్ వస్తుంది కాబట్టి. అప్పటి వరకు ఎన్ని పనులున్నా వాటిని పక్కనబెట్టి మరీ ఈ సీరియల్ ను చూసేవారు చాలా మందే ఉన్నారు. మహిళలతో పాటు పురుషులు కూడా కార్తీక దీపం ఫ్యాన్స్ అయ్యారు అంటే ఆ సీరియల్ ఎంత పాపులర్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు. రోజుకో మలుపు తిరుగుతూ.. ట్విస్ట్ లపై ట్డిస్టులిస్తే సాగుతున్న ఈ సీరియల్ మాత్రమే కాకుండా ఇందులో నటించే వారు కూడా స్టార్ నటులుగా పేరు తెచ్చుకున్నారు.

ఇక ఇందులో ప్రధాన పాత్రలుగా దీప పాత్రలో ప్రేమీ విశ్వంత్, డాక్టర్ బాబు పాత్లరో నిరుపమ్ పరిటాల నటిస్తున్నారు. ఇక వారి కూతుళ్లుగా శౌర్య పాత్రలో బేబీ కార్తీక, హిమ పాత్రలో బేబీ సహ్రుదలను నటిస్తున్నారు. ఈ సీరియల్లోని ప్రతీ క్యారెక్టర్ కు గుర్తింపే ఉంటుంది. ఇటీవల దీప చావు అంచుల వరకు వెళ్లే సరికి ఆమె కోలుకోవాలని ఎందరో మహిళలో ఆమె శ్రేయస్సు కోసం ఆరాధించారు. మొత్తానికి ఆమె ఆరోగ్యం బాగు పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక సీరియల్ లోనటించే వారి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా శౌర్య, హిమలు ఓ వైపు స్కూల్ కు వెళ్తూ మరో వైపు ఇందులో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి పారితోషికంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే వీరి పారితోషిక రోజుకు లక్ష పైనే ఉంటుందని సమాచారం. ఇంత చిన్న వయసులో శౌర్య, హిమలు సంపాదించడంపై సీరియల్ చూసే ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments