Thursday, September 23, 2021
spot_img
HomeFashion‘నారప్ప’లో నటించిన ఈమె గురించి తెగ సెర్ఛ్ చేస్తున్నారు..

‘నారప్ప’లో నటించిన ఈమె గురించి తెగ సెర్ఛ్ చేస్తున్నారు..

‘నారప్ప’లో తళుక్కున మెరిసిన ఈ భామ ఎవరో తెలుసా..?

లేదా

‘నారప్ప’లో నటించిన ఈమె గురించి తెగ సెర్ఛ్ చేస్తున్నారు..

లేదా

‘నారప్ప’ హీరోయిన్ గురించి నెటిజన్ల సెర్చింగ్..: ఎందుకంటే..?

కరోనా కారణంతో సినిమా షూటంగ్ లు పూర్తయినా థియేటర్లోకి రాని పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా థియేటర్లలో రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో ఓటీటీ ఫ్లాట్ ఫాంలే దిక్కవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేవ్ మూవీ ‘నారప్ప’ను ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. అయితే థియేట్రికల్ ఊపు లేకున్నా నారప్ప లో వెంకటేశ్ నటన ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో వెంకటేశ్ తో పాటు చాలా మంది నటులకు గుర్తింపు వచ్చింది. వారిలో అమ్ము అభిరామి ఒకరు.

వెంకటేశ్ ఈ సినిమలో రెండు పాత్రల్లో కనిపిస్తారు. ప్లాష్ బ్యాక్లో వచ్చే వెంకటేశ్ తో కలిసి నటించింది అమ్ము అభిరామి. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈమె గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈమె ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అని సెర్చ్ చేస్తున్నారు. నటనపై తెగ ఇంట్రెస్టు ఉన్న అభిరామి 2017లోనే సినీ ఇండస్ట్రీకి వచ్చారు. తమిళ సినిమా ‘భైరవ’ అనే సినిమాలో మెడికల్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో మెరిసింది అభిరామి. ఆ తరువాత ఈ భామకు అవకాశాలు బాగానే వచ్చాయి.

ఇక తెలుగులోకి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ సినిమాలో కనిపించింది. అభిరామి. ఈ సినిమాలో హీరో మేనకొడలి పాత్రలో ఆకట్టుకుంది. ఆ తరువాత ‘ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్’ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక తాజాగా నారప్ప సినిమాలో వెంకటేశ్ పక్కన నటించి మంచి మార్కులే కొట్టేసింది.

ఈ సినిమాలో ప్రియమణి కాస్త డీ గ్లామర్లో కనిపించినా.. అభిరామి మాత్రం అందంతో యూత్ ను ఆకట్టుకుంది. ఇక త్వరలో మణిరత్నం తీయబోయే ‘నవరస’ అనే సినిమాలో కనిపించనుంది. గతంలో అభిరామి ‘అమ్మాయిల వర్జినిటి’ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మరి అభిరామి మరే సినిమాలో మెరుస్తుందో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments