Friday, July 23, 2021
spot_img
HomeUncategorizedనా భార్య గోదావరి జిల్లాకు చెందినావిడే: సోనూసుద్

నా భార్య గోదావరి జిల్లాకు చెందినావిడే: సోనూసుద్

సినిమాల్లో విలన్ గా పేరు తెచ్చుకున్న సోనూసుద్ రియల్ లైఫ్లో ఆపన్నహస్తుడిగా నిలిచాడు. దాదాపు సంవత్సరకాలంగా ప్రజలకు సేవ చేస్తున్న సోనూసుద్ తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టి మరీ పేదలను ఆదుకుంటున్నాడు. అడిగినవారికి లేదనకుండా.. కాదనకుండా.. ఇస్తున్న ఈ రియల్ హీరో ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇటీవల సోనూసుద్ మాట్లాడుతూ తన వైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు.

సోనూసుద్ భార్య సోనాలి సుద్. వీరికి ఇద్దరు కుమారులు. ఇశాంత్ సుద్, అయాన్ సుద్. కాగా సొనాలి సుద్ తెలుగింటావిడే అని కొందరికే తెలుసు. ఈమె తల్లిదండ్రులు గోదావరి జిల్లాకు చెందిన వారే. అయితే వారు బాంబేలో స్థిరపడ్డారు. సోనాలి కూడా అక్కడే పుట్టింది. కానీ హైదరాబాద్ కు సొనాలి వస్తూ ఉంటుంది. సోనూసుద్ కూడా తన వైఫ్ తెలుగింటావిడ అని గర్వంగా చెబుతానని అంటాడు.

ఇక సోనూసుద్ మాట్లాడుతూ తాను సామాన్య వ్యక్తినేనని, తనని దేవుడితో పోల్చవద్దన్నారు. తనని కర్ణుడితో పోలుస్తున్నారని, అయితే అంత పెద్ద వ్యక్తిని కాదని అన్నారు. ఇక మనం ఎంత సాయం చేస్తే అంత తిరిగి వస్తుందనే నమ్మకం ఉందని అంటారు. పేదలకు సాయం చేస్తున్నానన్న తృప్తి ఎక్కువగా సంతోషాన్నిస్తుందని సోనూసుద్ చెప్పొకొచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments