Thursday, July 22, 2021
spot_img
HomeUncategorized‘ఫ్యామిలీ మాన్-2’కు సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

‘ఫ్యామిలీ మాన్-2’కు సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె అంతకుముందు కంటే అక్కినేని ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఎక్కువగా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక కరోనా కారణంగా సినిమాలు లేక హీరోయిన్లంతా ఇంటిపట్టున్న ఉంటే సమంత మాత్రం వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు

ఇప్పటికే పలు వెబ్ సిరీసుల్లో నటించిన సామ్ తాజాగా ఫ్యామిలీ మాన్ -2లో అలరించిన విషయం తెలిసింది. ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలయిన ఈ మూవీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో సామ్ పాత్రపై అందరూ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయితే డీగ్లామర్ తో పాటు ఎవరూ ఊహించని విధంగా నటించిన సమంత ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారనే దానిపై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.

ఫ్యామిలీ మాన్ -2 ప్రారంభం నుంచే సమంత పాత్రపై హైప్ క్రీయేట్ చేశారు. అనుకున్నట్లుగానే సామ్ ఇందులో నటనతో ఆకట్టుకుంది. తమిళ యువతిగా నటించిన సమంత ఒక్కో సీన్లో కాస్త హద్దులు దాటిందని అంటున్నారు. ఏదీ ఏమైనా సమంత సినిమాల్లో కంటే ఇందులో తన నట విశ్వరూపాన్ని చూపించారని అంటున్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో వచ్చిన ఇందులో మనోజ్ భాజ్ పాయ్, సమంతలు ప్రధానంగా నటించారు.అందుకే వీరికి మిగతా వారికంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ అందినట్లు ఫిల్మ్ వర్గాల టాక్.

మనోజ్ బాజ్ పాయ్ కి మొత్తం ఎపిసోడ్లకు కలిపి రూ.10 కోట్లు అందజేశారట. ఇక సమంత తన పాత్ర కోసం రూ. 4 కోట్లు తీసుకున్నారట. అంతకుముందు మనోజ్ భార్య పాత్రలో నటించిన ప్రియమణి రూ.80 లక్షలు పుచ్చుకున్నట్లు టాక్. మిగతా నటులైన దర్శన్ కుమార్ రూ.కోటి, షరీఫ్ హష్మీకు 65 లక్షలు వచ్చినట్లు చర్చించుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments