Sunday, July 25, 2021
spot_img
HomeUncategorizedరెహమాన్ మాస్క్ ధర తెలిస్తే దిమ్మదిరుగుద్ది..!

రెహమాన్ మాస్క్ ధర తెలిస్తే దిమ్మదిరుగుద్ది..!

కరోనా మహహ్మారి విజృంభించడంతో మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. కొన్ని దేశాల్లో ఈ మాస్క్ ధరించడాన్ని తొలగిస్తున్నా ఇండియాలో ఇంకా కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గకపోవడంతో మాస్క్ తప్పనిసరి అని ప్రభుత్వం మార్గదర్శకాలు చేస్తూనే ఉంది. అయితే సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరిస్తున్నారు. సామాన్యలు మాస్క్ లపై కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా 1000 రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే సెలబ్రెటీలు మాత్రం మాస్క్ లపై ఎక్కవే ఖర్చు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ ధరించిన మాస్క్ ధరపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆయన ధరించిన మాస్క్ ధరపై రకరకాల చర్చ జరుగుతోంది. రెహమాన్ తన ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటాడు. అదే సమయంలో తన ద్వారా ఇతరులకు హాని కలగవద్దని కూడా ఆలోచిస్తారు. ఈ తరుణంలో ఆయన మాస్క్ ను రూ.12000 పెట్టి కొనుగోలు చేశారట. రెహమానే కాకుండా మరికొంతమంది సెలబ్రెటీలు ఎక్కువ రేటు పెట్టి మాస్క్ లు కొంటున్నారు. ఆ మధ్య తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రూ.2,300 వెచ్చించాడని నెట్టింట్లో కథనాలు వచ్చాయి. తాజాగా ఏ.ఆర్. రెహమాన్ రూ.12000 పెట్టి మాస్క్ పెట్టుకోవడం ఆసక్తిగా మారింది.

ఇక రెహమాన్ చేసేది తక్కువ సినిమాలే అయినా ఆయన పారితోషికం బాగానే ఉంది. ప్రతీ సినిమాకు ఆయన రూ.5 కోట్లు తీసుకుంటున్నాడట. సినిమా హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా రెహమాన్ సాంగ్స్ మాత్రం పాపులర్ అవుతాయి. అందుకే రెహమాన్ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. ఆయన తరువాత సౌత్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ లైన్లోకి వస్తారు. ఇక రెహమాన్ భారతీయుడు -2కుసంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments