Thursday, September 23, 2021
spot_img
HomePoliticsవైఎస్ జగన్ పై , షర్మిల సంచలనవ్యాఖ్యలు వింటే షాక్ అవుతారు.

వైఎస్ జగన్ పై , షర్మిల సంచలనవ్యాఖ్యలు వింటే షాక్ అవుతారు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరని అంటూ ఉంటారు. ఇంతకు ముందు మిత్రులుగా ఉన్నవాళ్లు, రాజకీయాల మూలంగా శత్రువులుగా మారిన వారిని చాలా మందినే చూశాం. కాని ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు వేరు వేరు పార్టీలలో ఉండడం కూడా మనం ఇది వరకు చాలానే చూశాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితులనే మరోసారి చూడబోతున్నాం. ఇక విషయానికొస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని సోదరి వై ఎస్ షర్మిల తెలంగాణ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తో తెలంగాణ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన సంగతి మనందరికి తెలుసు. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జగన్ పై షర్మిల తీవ్రమైన ఘాటు విమర్శలు చేసింది. తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్, వై ఎస్ ఆర్ ని తిడుతుంటే, ఆయన వారసులు అని చెప్పుకొని తిరుగుతున్న కొంతమంది నాయకులు మాత్రం చేతులు కట్టుకొని సైలెంట్ గా నిల్చున్నారని , వై ఎస్ ఆర్ వారసులు అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా అంటూ షర్మిల, జగన్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో పెను మార్పులు సంతరించున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవలే జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో హల్ ఛల్ చేస్తున్నాయి, ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రోజు రోజుకి ఈ సమస్య ఎంతో ప్రదకరంగా మారుతుంది, ఈ సమస్య గురించి మీ స్పందింన చెప్పాలని షర్మిల ని ఒక విలేకరు కోరగా , షర్మిల ఈ విధంగా చెప్తూ ‘ ఆంధ్రరాష్ట్ర ముఖ్య మంత్రికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రికి చాలా గొప్ప సంబంధాలే ఉన్నాయి కదా, ఒకరినొకరు ఇంటికి పిలిపించుకొని మరి అతిధి సత్కారాలు చేసుకుంటూ , పసందైన విందు భోజనాలతో బాగా కలిసారుగా , అలాంటిది మీరిద్దరూ కూర్చొని సమస్యకి పరిష్కారం తీసుకొని రావొచ్చు కదా అని తీవ్ర విమర్శలతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై ఆమె మండిపడ్డారు. మీకు జనాల పట్ల ఎలాంటి ఆలోచనలు లేవు, ఎంతసేపు ప్రత్యర్థులయిన చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ వంటి వారిని , వారి పార్టీలను నిందించడమే సరిపోతుంది. ఇంకా రాజకీయంగా ఎదిగే వాళ్ళను తొక్కడం మీద పెట్టిన శ్రద్ద, ఈ జల వివాదం పై ఇరువురు ముఖ్యమంత్రులు ద్రుష్టి పెట్టి ఉంటె ఈసమస్య ఎప్పుడో తీరిపోయేదంటూ షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చింది.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై ఏపీపీఎస్సీ విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, మూడువేలకి పైగా పోస్టులు ఖాళిగా ఉంటే, కేవలం 25 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసారని , విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మరి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు చేసారు, వెంటనే ఈ నెల 20 వ తేదీన ఏపీపీఎస్సీ కి 1800 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యడంతో విద్యార్థులు కాస్త శాంతించారు, అయితే మిగిలిన పోస్టులను కూడా త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తామని, దయచేసి ఎవ్వరు ఆందోళనకు గురి కావొద్దని, ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మనోస్థైర్యాన్నిచ్చింది.

ఇటీవల విజయవాడలో విద్యార్థులందరు కలిసి తమకు న్యాయం జరిగేలా పోరాటం చెయ్యాల్సిందిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ ఆవేదనని వ్యక్తపరిచిన సంగతి మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ ఈ నెల 20 వ తేదీ లోపు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ప్రభుత్వం పై తమ పోరాటానికి సంబంధించిన కార్యచరణను విడుదల చేస్తామని తెలిపిన సంగతి కూడా మన అందరికి తెలిసిందే, ఈ సమస్య జటిలం అయ్యే పరిస్థితిని గమనించిన ప్రభుత్వం కిందకి దిగి వచ్చింది అని ఈ సందర్భంగా సోషల్ మీడియా లో జనసేన పార్టీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. కావున ఈ సందర్బంగా ఎలాంటి సమస్యలనైనా సత్వరమే పరిష్కరిస్తూ, ప్రజల యొక్క బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత సదా ముఖ్యమంత్రులపై ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
ఉపాసన బర్త్ డే స్పెషల్ వీడియో

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments