Friday, July 23, 2021
spot_img
HomeUncategorizedసీఎం కొడుకుతో రాజశేఖర్ కూతురు రొమాన్స్..?

సీఎం కొడుకుతో రాజశేఖర్ కూతురు రొమాన్స్..?

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. గతంలో ఆయన నటించిన ‘ఆర్టీవీ దెయ్యం’లో కనిపించిన ఆయన లైఫ్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. సినీ పరిశ్రమకు చెందిన జీవితను పెళ్లి చేసుకున్న రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరు ఒకరు శివాని కాగా.. మరొకరు శివాత్మిక. అయితే వీరిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలన్న రాజశేఖర్ దంపతుల కల నెరవేరనుంది.

ఇప్పటికే ‘దొరసాని’ సినిమాతో శివాత్మిక ఎంట్రీ ఇచ్చారు. ఇక కృష్ణ వంశీ డైరెక్షన్లో వస్తున్న రంగమార్తాండలోనూ నటిస్తోంది. ఇక పెద్ద కూతురు శివాని సినీ ఇండస్ట్రీ లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చారు. 2 స్టేట్స్ అనే సినిమాలో నటించిన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ప్రస్తుతం సినిమా కష్టాలున్నందున వీరికి అవకాశాలు రాలేదు.

తాజాగా శివానికి బంపర్ ఆఫర్ వచ్చింది. తెలుగుతో పాటు కోలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్న శివానికి ఏకంగా సీఎం కూమారుడితో నటించే అవకాశం దక్కించుకుంది. హిందీ మూవీ ఆర్టీకల్ -15ను తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. బోనీకపూర్ నిర్మతగా ఉన్న ఈ సినిమాలో తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి హీరోగా నటిస్తున్నారు. ఇందులో రాజశేఖర్ కూతురు శివానికి నటించే అవకాశం వచ్చింది.

ఉదయనిధి మొన్నజరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వెంటనే ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. ఓ వైపు మంత్రిగా సేవలందిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ఏదీ ఏమైనా శివాని ఈ సినిమాతోనైనా వెండితెరపై కనిపిస్తుందా..? లేదా..? చూడాలి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments