Thursday, July 22, 2021
spot_img
HomePoliticsటీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ నియామకం.. ఉత్తర్వులు జారీ

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ నియామకం.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డిని (ఐఎఎస్) బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ ఆమోదించారు.

కాగా, ప్రస్తుతం డా. బి. జనార్దన్ రెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక కమిషన్ సభ్యులుగా సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఎ తెలుగు, తెలుగు పండిట్), కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి), ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి.ఎ.ఎమ్.ఎస్ (ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్), మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్), సీబీఐటీ ప్రొఫెసర్ బి లింగారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారిలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments