Wednesday, September 22, 2021
spot_img
HomeMovies‘అల్లుడు శీను’ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టుకోవాల్సిందే..

‘అల్లుడు శీను’ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టుకోవాల్సిందే..

టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు శీను’ సినిమాతో స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ నటుడు ఆ తరువాత నాలుగైదు సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోనూ తన ఫర్ఫామెన్స్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ తరుణంలో సాయి శ్రీనివాస్ ఆస్తులపై సినీ ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

Bellamkonda Sai Sreenivas Wiki, Age, Height, Family, Net Worth, Biography &  More

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ-పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన సాయి శ్రీనివాస్ 1993లో జన్మించారు. హైదరాబాద్ స్కూల్లో ప్రైమరీ స్టడీస్ చేసిన ఆయన ఆ తరువాత హైయ్యర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడే లాస్ ఏంజిల్స్ లోని లీస్టార్ బెర్గ్ అనే ఇనిస్టట్యూట్లో ఫిల్మ్ కోర్సు చేశారు. అయితే చిన్నప్పటి నుంచి సాయి శ్రీనివాస్ కు సినిమాలంటే ఇష్టం. తన తండ్రితో కలిసి షూటింగ్ లకు వెళ్లేవాడు. అప్పుడే సినిమాల్లో నటిస్తానని అనడంతో స్టడీస్ పై ఫోకస్ పెట్టాలని తండ్రి సూచించాడు.

Shocking rumor on Bellamkonda Bollywood movie .. Reverse the whole plan? -  The Post Reader

దీంతో చదువు పూర్తి చేసుకున్న తరువాత సాయి శ్రీనివాస్ 2014లో ‘అల్లుడు శీను’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత స్పీడున్నోడు, జయజయజానకి, సాక్ష్యం, రాక్షసుడు, సీత వంటి సినిమాలు చేశాడు. గత మార్చిలో ఆయన నటించిన అల్లుడు శీను అదుర్స్ అనే సినిమా విడుదలైంది. ఇక ఛత్రపతి హిందీలో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.

Bellamkonda Suresh Birthday Celebrations Photos

ఇక శీను మొదటి సినిమాకు రూ.1.70 కోట్లు తీసుకున్నాడు. రాక్షసుడు అనే సినిమాకు 7.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఆయన ఆస్తి మొత్తం విలువ రూ.280 కోట్లు ఉంటుందని సమాచారం. ఖరీదైన నాలుగు కార్లున్న ఆయన పేరిట జూబ్లిహిల్స్ లో ఇల్లు కూడా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments