Thursday, September 23, 2021
spot_img
HomePoliticsఖమ్మంలో జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు కుదిరింది

ఖమ్మంలో జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు కుదిరింది

తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో 12 డివిజ‌న్ల‌లో బీజేపీ, 10 డివిజ‌న్ల‌లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించ‌నున్నారు. అయితే, ఎక్క‌డెక్క‌డి నుంచి ఏ పార్టీ అభ్య‌ర్థి బ‌రిలోకి దిగాలి అనే విష‌యంపై ఇరు పార్టీలు త్వ‌ర‌లోనే మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయించనున్నారు.

ఇదిలావుంటే, జ‌న‌సేన‌-భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ధ్య ఏపీలో పొత్తు బాగున్నప్పటికీ.. తెలంగాణ‌లో భిన్నమైన ప‌రిస్థితి.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీకి స‌పోర్ట్ చేసిన జ‌న‌సేన‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి మాత్రం టీఆర్ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. ఇక నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో జనసేన పార్టీ త‌ట‌స్థంగా ఉంది.. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ ఖ‌మ్మం వేదిక‌గా.. ఆ రెండు పార్టీలు మళ్ళి దోస్తీ కడుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments