Thursday, September 23, 2021
spot_img
HomePoliticsసీనియర్ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం

సీనియర్ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఎన్‌టీఆర్‌ ఘాట్‌ వద్ద సంచలన ప్రకటన చేసి టీడీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments