Thursday, July 22, 2021
spot_img
HomePoliticsఈటెల Vs కేసీఆర్: టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ పై ప్రభావం!

ఈటెల Vs కేసీఆర్: టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ పై ప్రభావం!

టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత దోబూచులాట వ్యవహారాలు ఒక్కసారిగా మంత్రి ఈటెల వ్యవహారంతో బహిర్గతం అయ్యాయి. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. సోషల్ మీడియాలో ఈటెలకు మద్దతు లభిస్తుంది. అటు కేసీఆర్ అభిమానులు ఈటెలను తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా తెరాస కార్యకర్తలు రెండుగా చీలి ఫైర్ అవుతున్నారు. ఏదిఏమైనా ఈటెల ఇష్యూతో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూసే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైద్యఆరోగ్యశాఖ నుంచి ఈటలను తప్పించారు. ఆయన నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం.. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఆయన్ను వైద్యఆరోగ్యశాఖ నుంచి తప్పించాలని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు సిఫారసు చేశారు. అంతేకాదు ఆ శాఖను తనకు కేటాయించాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్రవేశారు. ప్రస్తుతం మంత్రి ఈటల వద్ద ఏ శాఖ కూడా లేదు. త్వరలోనే మంత్రివర్గం నుంచి కూడా బర్తరఫ్ చేస్తారని తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments