Thursday, September 23, 2021
spot_img
HomePoliticsపవన్ కళ్యాణ్‌ ఈజ్ బ్యాక్.. నెగిటివ్ రిపోర్ట్

పవన్ కళ్యాణ్‌ ఈజ్ బ్యాక్.. నెగిటివ్ రిపోర్ట్

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్‌గా నిర్దారణ అయింది. పవన్‌కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో… ఆయన త్వరగానే కోలుకున్నారు. హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు.

కాగా, పవన్ కోవిడ్ బారినపడ్డారనే వార్త తెలియగానే ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చేశారు. మరికొందరు పూజలు సైతం చేశారు. అయితే తాజాగా పవన్ కు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments