Thursday, September 23, 2021
spot_img
HomeMoviesఅనౌన్స్: త్రివిక్రమ్-మహేష్ సినిమా అప్డేట్ వచ్చేసింది

అనౌన్స్: త్రివిక్రమ్-మహేష్ సినిమా అప్డేట్ వచ్చేసింది

గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు ఎంత హిలేరియస్ కామెడీని పంచాయో అందరికీ తెలిసిందే. విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటే ఆ ఇద్దరి కాంబోలో సినిమాలపై అభిమానులకు, ఆడియెన్స్‌కి ఉండే ఆసక్తి ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి త్రివిక్రమ్ సినిమా రానుంది. ఈమేరకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా తెలిపింది. సూర్యదేవర రాధాకృష్ణ దీనిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ సంస్థలో మహేష్ బాబు నటించడం ఇదే తొలిసారి. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా మూవీ జనం ముందుకు వస్తుందని దర్శక నిర్మాతలు స్పెషల్ వీడియో ద్వారా తెలియచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments