Monday, September 20, 2021
spot_img
HomePoliticsవారంలో ‘వకీల్ సాబ్’ వసూళ్లు ఎంతంటే?

వారంలో ‘వకీల్ సాబ్’ వసూళ్లు ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా టాలీవుడ్‌లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. వారాంతం తర్వాత, కరోనా వైరస్ పరిస్థితుల్లో కూడా ది బెస్ట్ కలెక్షన్లను నమోదు చేసింది. దీంతో 100 కోట్ల రూపాయల క్లబ్‌కు ఈ చిత్రం చేరువైంది. అనేక ప్రతికూలతలను ఎదిరిస్తూ లాక్‌డౌన్ తర్వాత ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ దూసుకెళ్తున్నది.

వకీల్ సాబ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.95.3 కోట్ల బిజినెస్ చేసింది. నైజాంలో రూ. 28.2 కోట్లు, సీడెడ్ రూ.13.1 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.11.6 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.6.3 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.4 కోట్లు, గుంటూరు రూ. 7.2 కోట్లు, కృష్ణా జిల్లా రూ.4.9 కోట్లు, నెల్లూరు రూ.3.8 కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.82.4 కోట్లు బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో రూ.6.5 కోట్లు, ఓవర్సీస్ రూ.6.4 కోట్లతో మొత్తంగా 95.3 కోట్ల బిజినెస్ నమోదు చేసింది.

దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. పింక్ సినిమా రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా అంచనాలను మించి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లిపోతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments