Monday, September 20, 2021
spot_img
HomePoliticsవైన్ షాప్స్ బంద్ మూసేయండి: హైకోర్టు

వైన్ షాప్స్ బంద్ మూసేయండి: హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తోంది. దాని తదుపరి చర్యలేంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ఏజీ సమాధానం ఇవ్వగా.. దానిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో జరగనున్న మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలపై ఘాటుగా స్పందించింది హైకోర్టు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ఎస్‌ఈసీని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా అంటూ ప్రశ్నించింది. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఈసీ అధికారులు తెలిపారు. వాయిదా అవకాశం లేనందున మున్సిపల్ ఎన్నికలు సజావుగా, జాగ్రత్తగా నిర్వహించాలని ఎస్ఈకి హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments