Thursday, September 23, 2021
spot_img
HomePoliticsదొంగ ఓట్లు నవరత్నాల్లో భాగమా? తిరుపతి ఎన్నికలు రద్దు చేయాలి: జనసేన

దొంగ ఓట్లు నవరత్నాల్లో భాగమా? తిరుపతి ఎన్నికలు రద్దు చేయాలి: జనసేన

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేయాలనీ జనసేన పార్టీ లేఖ విడుదల చేసింది. తిరుపతి ఉపఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి వేల కొద్ది దొంగ ఓట్లు వేశారని.. వారిని అరికట్టడంలో పోలీసులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికలో ఉన్నతాధికారులు, పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేశారని చెప్పారు. విధుల్లో ఉన్న అధికారుల కళ్ల ముందే దొంగ ఓట్లు పోలవుతుంటే చోద్యం చూశారని ఆరోపించారు. దొంగ ఓట్లు నవరత్నాల్లో భాగమా అంటూ లేఖలో ప్రశ్నించింది.

కాగా, తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఇతర నియోజకవర్గాల నుంచి వెళ్లి కొందరు దొంగ ఓట్లు వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసుల సహకారంతోనే రిగ్గింగ్ జరిగిందని మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో అవకతవకలపై బీజేపీతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తిరుపతి లోక్ సభ ఉప తిరుపతి ఉప ఎన్నికను తక్షణమే రద్దు చేసి మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments