Thursday, July 22, 2021
spot_img
HomePoliticsEtela Delhi Tour: ఢిల్లీకి ఈటల.. సోనియాతో భేటీ?

Etela Delhi Tour: ఢిల్లీకి ఈటల.. సోనియాతో భేటీ?

భూకబ్జాల ఆరోపణలపై ఒక్కసారిగా ఎమ్మెల్యే ఈటలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పీకేశారు. తర్వాత మంత్రిగా కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ప్రస్తుతం మాజీమంత్రి టీఆర్ఎస్ లో ఉన్నారో లేదో కూడా కన్ఫ్యూజన్ గానే ఉంది. అయితే మాజీమంత్రి, ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. శని, ఆదివారాల్లో ఢిల్లీలోని పలువురు కీలక నేతలతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. ఈటల భవిష్యత్ రాజకీయాల్లో మాజీమంత్రి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతానికైతే సస్పెన్సనే చెప్పాలి. అయితే వరసబెట్టి చాలమందితో సమావేశమయ్యారు. ఒకవైపు బీజేపీ నేతలతో సమావేశమవుతునే మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా భేటీలు జరుపుతున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈటల ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారట. కాగా ఇటీవల రాజేంద్ర రేవంత్ రెడ్డికి దగ్గర అవుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లోనూ ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఈటల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments