Thursday, September 23, 2021
spot_img
HomePoliticsకొండా సురేఖ.. షర్మిల పార్టీలో చేరడంపై క్లారిటీ

కొండా సురేఖ.. షర్మిల పార్టీలో చేరడంపై క్లారిటీ

వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన షర్మిల.. వైఎస్ కుటుంబానికి గతంలో సన్నిహితంగా ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు షర్మిల. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిని కూడా షర్మిల తన పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు అనుచరులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత షర్మిల పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చిందని కొండా మురళీ తెలిపారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలో చేరబోమని స్పష్టం చేశారు.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పిన ఆయన.. ఆ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments