పుష్ప రికార్డ్స్ ని బాలీవుడ్ బడా హీరోలు తట్టుకోలేకపోతున్నారా?

By | January 10, 2022

పుష్ప సినిమా తెలుగులో నెగటివ్ టాక్ తెచ్చుకున్న కాని మిగతా భాషల్లో మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీలో పుష్ప ఊహకు మించిన వసూళ్లు రాబడుతుంది. ఓపెనింగ్ డే మూడు కోట్ల వసూళ్లు సాధించిన పుష్ప హిందీ వర్షన్… రెండు వారాల తర్వాత కూడా అదే రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప కలెక్షన్స్ స్థిరంగా కొనసాగాయి. ప్రతి వీకెండ్స్ లో కలెక్షన్స్ పుంజుకోవడం జరిగింది.

ఒక సినిమాకు ఇలా స్థిరంగా సాలిడ్ వసూళ్లు రావాలంటే హీరోకి స్టార్డం ఉండాలి లేదా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చేయాలి.తెలుగులో కంటే కూడా హిందీలోనే పుష్ప అతిపెద్ద విజయం సాధించింది. ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో చేరుకునే పరిస్థితి కూడా లేదు. నైజాంలో మాత్రం జస్ట్ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. పుష్ప తో నష్టపోయిన ఆంధ్రా బయ్యర్లకు నిర్మాతలు కొంత మేర తిరిగి చెల్లించినట్లు సమాచారం.పుష్ప విడుదలై మూడు వారాలు దాటిపోగా.. జనవరి 7నుండి అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా చూస్తున్నారు. దీంతో పుష్ప మూవీని, హీరో అల్లు అర్జున్ ని పొగుడుతూ ట్వీట్స్ వేస్తున్నారు.

కరణ్ జోహార్, అర్జున్ కపూర్ లాంటి వారు పుష్ప మూవీ గురించి పాజిటివ్ గా స్పందించారు. అక్కడ మన సినిమాలు ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నా బాలీవుడ్ స్టార్స్ చూడాలి, వాటి గురించి మాట్లాడాలి అనుకోరు. దానికి వాళ్ళ అహం అడ్డు వస్తుంది.బాలీవుడ్ ఖాన్ లు అసలు పట్టీపట్టనట్లు ఉంటారు. కరణ్ జోహార్ లాంటి వాళ్లు ఏదో మొక్కుబడిగా మూవీ చూసి ఒక ట్వీట్ చేస్తారు. ఇదంతా ఓర్చుకోలేని తనమే అని చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్న చూపు కలిగిన బాలీవుడ్ హీరోలు… తెలుగు సినిమాలు అక్కడ రికార్డ్స్ తిరగరాయడం తట్టుకోలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published.