పట్టపగలే రెచ్చిపోయిన కామంధులు..

By | January 10, 2022

పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా నల్గొండలో మరో దారుణం వెలుగులోకి చూసింది.నల్లగొండ జిల్లాలో పట్టపగలే కామాంధులు రెచ్చిపోయారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పట్టపగలు అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న 54 ఏళ్ల వయస్సు గల మహిళను ఇద్దరు వ్యవసాయ కూలీలు ఇంట్లోకి లాక్కెళ్లి, వివస్త్రను చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు.

నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, పుల్లయ్యలుగా గుర్తించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రోడ్డు వెళ్తున్న మహిళను ఇద్దరు నిందితులు ఇంట్లోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు పారిపోయారు.పారిపోయే క్రమంలో వారికి మహిళ మరిది కనిపించాడు. ఆమె రోడ్డు మీద పడి ఉందని వారు అతనికి చెప్పారు. వారు చెప్పిన చోటికి అతను వెళ్లాడు. అయితే, వదిన కనిపించలేదు. దాంతో అతను లింగయ్య ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఆమెకు వదిన శవం కనిపించింది. తలపై, ఒంటిపై తీవ్రమైన గాయాలు అయినట్లు గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..

Leave a Reply

Your email address will not be published.