కరోనా అయినా మన స్టార్స్ అస్సలు తగ్గట్లేదుగా…

By | January 11, 2022

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఎక్కువ సినిమాల షూటింగ్స్ కి మళ్లీ బ్రేక్ పడింది. సినీ స్టార్స్ ఒక్కొక్కరు కూడా కరోనా బారిన పడుతున్నారు.కాబట్టి ఇలాంటి టైమ్ లో బయటిక రావడానికి స్టార్స్ ఇష్టపడట్లేదు.అయితే కొందరు మాత్రం కరోనా అనే భయం కూడా లేకుండా అసలు ఏమాత్రం కూడా తగ్గకుండా సెట్స్ పై హల్చల్ చేస్తున్నారు. మాస్ రాజా రామారావు అన్ డ్యూటీ సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఒకేసారి ఐదారు సినిమాలను చేతిలో పెట్టుకున్న రవితేజ.. కాస్త రిలాక్స్ అయినా నష్టమే అనుకుంటున్నారు. అందుకే సెట్స్ పై ఉన్న రామారావు ఆన్ డ్యూటీని చుట్టేస్తున్నారు. ఈ సినిమాతో పాటూ ధమాకా, టైగర్ నాగేశ్వరరావు పనులతో బిజీగా ఉన్నారు. త్వరలోనే సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసురను మొదలెట్సాల్సి ఉంది.

సౌత్ టు నార్త్ వరుసగా సినిమాలకు కమిట్మెంట్స్ ఇస్తూ ఫుల్ బిజీగా మారింది సమంతా. ఇక టైమ్ వేస్ట్ చేయకుండా ఒక దాని తర్వాత మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెడుతుంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద షూటింగ్ హైదరాబాద్ నానక్ రామ్ గుడాలో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ ను ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని రీసెంట్ గానే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ వంటి వారు నటిస్తోన్న యశోద సెకండ్ షెడ్యూల్ జనవరి 13 తో పూర్తి చేయాలని ప్లాన్. అందుకే అందరూ ఆగినా.. అనుకున్న టైంకే బ్రేక్ తీసుకోబోతున్నారు యశోద టీమ్.

ఈ మధ్యే పట్టాలెక్కిన ధనుష్ సార్ సినిమా షూటింగ్.. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు గ్యాప్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే కొవిడ్ బ్రేక్ తీసుకోకుండా ధనుశ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.ఇక సార్ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.