సమంత రోజువారీ అలవాట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

By | January 11, 2022

సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణి అని చెప్పవచ్చు. ఇక ఈమె వివాహానికి ముందు ఎంత దూకుడు అయితే ప్రదర్శించిందో.. వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది అనే చెప్పాలి. ఇక 1, 2 ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటించిన సమంత తాజాగా తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొని మళ్ళీ తన కెరియర్లో స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు. ఇక ఎలాంటి పాత్ర చేయడానికి కూడా వెనుకాడడం లేదు.. బోల్డ్ క్యారెక్టర్ అయినా ఐటమ్ సాంగ్ అయినా ఏదైనా సరే తనకు నచ్చితే మాత్రం చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా సినీ రంగం లో స్టార్ హీరోయిన్ లా దూసుకుపోతోంది.

ఇక ఇప్పటికే తెలుగు, తమిళ ,హిందీ , హాలీవుడ్ లో కూడా సినిమాలను ఓకే చేస్తూ మంచి ఫామ్ లో ఉన్న సమంత తాజాగా ఒక వెబ్ సిరీస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన భర్త నాగచైతన్య తో పోల్చుకుంటే విడాకుల తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది అనే చెప్పాలి. స్టార్ హీరోయిన్లు సైతం సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి కూడా సమంతను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా సమంత ప్రస్తుతం తన బిజీ లైఫ్లో ఏం చేస్తుంది.. ఎలా ఉండబోతుంది . ఏం తింటుంది.. అనే విషయాలు తెలుసుకోవడానికి ఆమె అభిమానులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అవేంటో మనం కూడా తెలుసుకుందాం..

సమంత తెలిపిన వివరాల మేరకు ప్రతి రోజూ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తుంది అట.. ఇక ఆ తర్వాత రోజంతా ఏం చేయాలి.. ఎలా చేయాలి..అని ముందుగానే ఆలోచిస్తోందట.. అంతేకాదు ఆరోజు ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒక అంచనాకు వేసుకుంటానని, ఏయే పనులు చేయాలో ఒక బేరీజు వేసుకొని రోజున ప్రారంభిస్తాను అని తెలిపింది. ఇక ఈమె తీసుకునే ఫుడ్ మొత్తం మొక్కల ఆధారితమైనది అయి ఉండాలట.. అంతేకాదు ఈమె కి కొంచెం సానుభూతి ఎక్కువే అని, అందుకే సినిమా కెరియర్.. పర్సనల్ కెరియర్ లో కూడా చాలా ఉపయోగపడింది అంటూ తెలిపింది.. ఇక ఎప్పుడూ కూడా నిరాశ చెందను అని , ఏదైనా సాధ్యం అనే సవాల్ తోనే ప్రతి రోజు పనులు ప్రారంభిస్తాం అని తెలిపింది సమంత.. ఇక తాను తనతో మాత్రమే పోటీ పడతానని చుట్టూ ఉన్న వాళ్ళ కంటే తనని తాను దృఢంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటానని తెలిపింది.. తెలివైన వ్యక్తులతో రూమ్ షేర్ చేసుకోవడం అంటే తనకు చాలా ఇష్టమట.. ఇలా తన ఇష్టాఇష్టాలను కూడా తెలుపుకు వచ్చింది సమంత.

Leave a Reply

Your email address will not be published.