లోన్ ఇవ్వలేదని బ్యాంక్ కు నిప్పు పెట్టిన యువకుడు…

By | January 11, 2022

సాధారణంగా బ్యాంకువాళ్లు గనుక లోన్ అప్లికేషన్ తిరస్కరిస్తే చేసేదేమీలేక వేరే మార్గాలు వెతుక్కుంటారందరూ.కానీ ఈ యువకుడు మాత్రం లోన్ ఇవ్వలేదనే కోపంతో ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక లో వెలుగులోకి వచ్చింది.కర్ణాటకలోని హావేరి జిల్లా రట్టిహళ్లికి చెందిన వసీం హజరత్ సాబ్ ముల్లా అనే యువకుడు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఎలాగైనా రుణం పొందాలనే ప్రయత్నాల్లో భాగంగా కెనరా బ్యాంక్ హెడిగొండ బ్రాంచ్ వారిని సంప్రదించాడు. పర్సనల్ లోన్ కోరుతూ బ్యాంక్ మేనేజర్ కు అప్లికేషన్ పెట్టుకున్నాడు.

సరైన పత్రాలను అందించలేకపోయారు.సిబిల్ స్కోరు కూడా తక్కువగా ఉండటంతో రుణం మంజూరు చేయలేమని మేనేజర్ తెగేసి చెప్పాడు. ఈ విషయంలో కోపం పెంచుకున్న ముల్లా.. శనివారం రాత్రి షాకింగ్ చర్యకు ఒడిగట్టాడు. రాత్రి పూట దొంగలా బ్యాంకు బిల్డింగ్ వద్దకు వచ్చి, కిటికీలు బద్దలుకొట్టి, వెంట తెచ్చుకున్న బాటిల్ లో పెట్రోల్ ను లోనికి చల్లి, నిప్పటించాడు.నిమిషాల్లోనే బ్యాంకులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన స్థానికులు కొందరు తగలబడుతోన్న బ్యాంకు దగ్గర ముల్లాను చూసి అనుమానంతో పట్టుకోబోయారు.  నిందితుణ్ని అరెస్టు చేసే విచారించగా.. లోన్ ఇవ్వనందుకు బ్యాంకును తగలబెట్టాలనే ఐడియాను ముల్లాకు ఇచ్చింది ఓ బ్యాంకు మాజీ అధికారేనని తేలింది..

Leave a Reply

Your email address will not be published.