భార్యాభర్తలు ఈ విషయాలను అస్సలు బయట పెట్టకూడదు..

By | January 11, 2022

భార్యాభర్తల మధ్య చాలా సీక్రెట్స్ ఉంటాయి. వాటిని బయట పెట్టడం అంత మంచిది కాదు.కోపతాపాలు ఇలా ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇక కొందరు తమ వైవాహిక జీవిత విషయాలను ఇతరులతో చెబుతుంటారు. తమ మధ్య ఉండే రహస్యాలను స్నేహితులతో, నమ్మకస్తులతో పంచుకుంటారు.స్నేహితులతో, సన్నిహితంగా ఉండే బంధువులతో చర్చించకపోవడమే మంచిది. స్నేహితులతో ఉండే బంధానికి భాగస్వామితో ఉండే బంధానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎంతగానో నమ్మే స్నేహితులు, బంధువులు మీకు ఎంత మద్దతు ఇచ్చిన వారితో బంధం అనేది ఒక ఒక పరిమితిలో ఉంటుంది.

విషయాల గురించి వారికి చెప్పినప్పుడు నలుగురిలో ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామికి మీకు మధ్య జరిగిన గొడవ గురించి ఇతరులతో చర్చించరాదు. వాటిని మీరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అప్పుడే మీ మధ్య మూడో వ్యక్తి జోక్యం ఉండదు. ఆలుమగలకు సంబంధించిన పడక గదిలోని ఏకాంత ఫోటోలను మీ సన్నిహితులకు షేర్ చేయడం మంచిది కాదు.భాగస్వామి గత జీవిత విషయాల గురించి ఇతరులతో చర్చించరాదు. గడిచిపోయిన విషయాలను తిరిగి గుర్తు చేయడం మీ వైవాహిక జీవితానికి మంచిది కాదు. మీ ఆర్థికపరమైన సమస్యల గురించి ఇతరులతో చర్చించరాదు..అప్పుడే వారి బంధం మరింత బలపడుతుంది.

Leave a Reply

Your email address will not be published.