పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

By | January 12, 2022

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల లొ నటిస్తూ బిజీగా ఉన్నారు. దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న భీమ్లా నాయక్ నుంచి ఇప్పుడు ఒక ఫోటో విడుదల అయ్యింది.పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్‌ల ఫ్యామిలీ ఫొటో ఒకటి రిలీజై నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో నిత్యా మీనన్ భుజంపై చేయి వేసి నవ్వుతూ కనిపిస్తున్నారు. అలాగే, నిత్యా మీనన్ ఓ చంటిపిల్లాడిని ఎత్తుకొని ఉంది.

ఆసక్తికరంగా ఉన్న ఈ ఫ్యామిలీ ఫొటో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.త్రివిక్రం స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. సితార ఎంటర్‌మైంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఈ సినిమా మహ శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published.