మరొకరితో అక్రమ సంబంధం.. చున్నీ బిగించి..

By | January 12, 2022

అక్రమ సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చెస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ప్రాణాలును కూడా కోల్పోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజాంపుర కాలనీలో మంగళవారం వెలుగు చూసింది.తాగి వచ్చి వేధిస్తుండడంతో తానే చంపేశానని భార్య చెబుతుండగా, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లొకి వెళితే.. అజాంపుర కాలనీలో నివాసముండే అఫ్రోజ్‌ ఖాన్‌ కు భార్య ఫర్జానా బేగం, కుమారుడు ఉన్నారు.ఫర్జానా మొదటి భర్తను వదిలేసి, అఫ్రోజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అఫ్రోజ్‌ ఖాన్‌ గతంలో ఆటో నడిపే వాడు. కొద్ది రోజుల నుంచి అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. విసిగి పోయిన ఫర్జానా సోమవారం అర్ధరాత్రి సమయంలో భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను అరెస్టు చేశారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.