పుష్పరాజ్ గా మారిన ధావన్.. తగ్గేదెలే.. ?

By | January 12, 2022

ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. కాక ‘పుష్ప’లో బన్నీ చెప్పిన ట్రేడ్‌ మార్క్‌ డైలాగులు సూపర్‌గా పేలాయి. ఇవి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఇక నెటిజన్లు కూడా ‘పుష్ప’ డైలాగులను తమదైన స్టైల్లో అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా, ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ బన్నీ డైలాగులను తమదైన స్టైల్లో చెప్పి అలరించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో భారత ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఈ జాబితాలో చేరాడు.

పుష్ప… పుష్పరాజ్‌… మై ఝుకేగా నై ..అంటూ పుష్ప డైలాగ్‌ను చెప్పిఆకట్టుకున్నాడు. . కాగా తమ అభిమాన హీరో పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని గబ్బర్‌ అదిపోయే రేంజ్‌లో చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. గబ్బర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే గబ్బర్‌ పలు సినిమా పాటలు, డైలాగులను అనుకరించి ఆకట్టుకున్నాడు. కాగా గత కొంతకాలంగా బెంచ్‌కే పరిమితమవుతోన్న ధావన్ జనవరి 19 నుంచి ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ధావన్‌ చోటు దక్కించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published.