విడాకుల విషయం పై తొలిసారి స్పందించిన చైతూ.. వీడియో వైరల్..!!

By | January 13, 2022

సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నప్పటికీ నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ఒడిదుడుకులు రావడంతో ఒకరికొకరు కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిది అని నిర్ణయించుకున్న ఈ జంట అక్టోబరు రెండవ తేదీన సోషల్ మీడియా వేదికగా ఉమ్మడిగా విడిపోతున్నాము అంటూ ప్రకటించారు. ఇక దీనితో పాటు నాగచైతన్య అభిమానులు ఇటు సమంత అభిమానులు ఇద్దరూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇకపోతే సమంత తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తన లో ఉన్న భావోద్వేగ పూరితమైన వ్యాఖ్యలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఇక ఆ తర్వాత తన స్నేహితులతో కలసి గోవా ట్రిప్, తీర్థయాత్రలు ఇలా నచ్చిన ప్రదేశాలకు వెళుతూ కొంతవరకూ ఆ బాధ నుంచి కోలుకుందనే చెప్పవచ్చు. ఇకపోతే సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, హాలీవుడ్ చిత్రాలకు ఓకే చెబుతూ మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తన జీవితాన్ని మరింత బిజీగా మార్చుకుంటోంది. ఈమె మాత్రం ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో అనే విషయంపై ఏ మాత్రం వెల్లడించలేదు. ఇక నాగచైతన్య తన మనసులో బాధ ఉన్నప్పటికీ ఏమాత్రం వ్యక్త పరచకుండా సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ఇక లవ్ స్టోరీ సినిమా సక్సెస్ తర్వాత ప్రస్తుతం బంగార్రాజు సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఇకపోతే ఇదిలా ఉండగా మొదటిసారి నాగచైతన్య తన భార్య సమంత తో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో వెల్లడించారు. ప్రస్తుతం బంగార్రాజు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు చిత్రం యూనిట్. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య తన భార్య సమంతకు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అనే ప్రశ్న ఎదురుగా.. నాగ చైతన్య మాట్లాడుతూ అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం.. ఆమె సంతోషంగా ఉంది..నేను సంతోషంగా ఉన్నాను.. ఈ సిచువేషన్ లో ఇద్దరికీ బెస్ట్ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది.. ఈ వీడియోలో నాగచైతన్య చెప్పిన విధానం చూస్తూ ఉంటే నిజంగా విడాకులు నిర్ణయంతో నాగచైతన్య సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.