వామ్మో.. జడేజా కూడానా.. తగ్గేదెలే..?

By | January 13, 2022

ఈరోజుల్లో క్రికెటర్స్ ఆటను పక్కన పెట్టి సినిమాల పై ఇష్టాన్ని పెంచుకుంటుంటారు.. తెలుగు హీరోలు చేసిన సినిమాలలోని డైలాగులను స్పూప్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు..సెలబ్రెటీలను సెలబ్రిటీలే ప్రమోట్ చేస్తే ఆ రచ్చ ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. పాపులర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గతకొద్ది కాలంగా తెలుగు సినిమాల పాటలు, డైలాగులకు రీల్స్ చేసి అదరగొట్టారు. ‘

ఇది ఇలా ఉండగా.. పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు’ అంటూ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. అచ్చు అల్లు అర్జున్‌ మాదిరిగానే ‘పుష్ప రాజ్’ లా తయారయ్యి, నోట్లో బీడీ పెట్టుకుని డైలాగ్‌తో జడేజా షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకుముందు ‘పుష్ప’ లో ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన జడేజా ఇప్పుడు ఏకంగా ‘పుష్ప రాజ్’ గెటప్‌లోకి మారిపోయాడు. అంతేకాదు, జడేజా ‘పుష్ప రాజ్’ గెటప్‌లో ఉన్న పిక్‌నే తన ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ప్రొఫైల్ ను  కూడా పెట్టుకోవడం విశేషం.నిన్న శిఖర్ దావన్ కూడా పుష్ప డ్తెలాగును చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కోడుతుంది.. ఇప్పుడు ఇది కూడా..త్వరలోనే పుష్ప 2 సెట్స్ మీదకు వెల్లనుంది..
Leave a Reply

Your email address will not be published.