చేప వీర్యంతో వంట.. ఛీ..ఛీ..

By | January 13, 2022

ఇంతవరకూ చేపలను తినడం వాటితో వివిధ రకాల వెరైటీలను చేస్తారు.. కానీ చేప వీర్యంతో వంటలు ఎప్పుడైనా విని వున్నారా..చేప కళ్లను సైతం వదలకుండా నమిలేస్తున్నారు. వామ్మో ఇంత కక్కుర్తి గాళ్ళు ఎక్కడ వున్నారు అనుకుంటూన్నారా..  జపాన్ లో ఈ దరిద్రం చుస్తున్నారు.. ఇంకా చేప తోకల ను కూడా వదలకుండా తింటారు.జపాన్ ప్రజలు తెలివైనవారని మనకు తెలుసు. కానీ, వారు అంత చురుగ్గా ఉండటానికి.. వారు తినే ఇలాంటి ఆహారమే కారణమా అని ఒక్కోసారి.. ఆహార ప్రియులకు కూడా సందేహం వేస్తుంది.

కానీ.. మరీ తెలివితేటల కోసం మనసు డిస్ట్రబ్ అయ్యే ఆహారాన్ని లాగించలేం కాదా. జపాన్ ప్రజలకు మాత్రం అవేవీ పట్టవు. చివరికి.. ఇదిగో చేపల వీర్యాన్ని కూడా వదలకుండా కూర వండేస్తున్నారు. ఆ వీర్యం వంటకం గురించి పక్కన పెడితే.. ముందుగా, చేప కళ్లతో తయారు చేసే డిష్ అక్కడ బాగా ఫెమస్ అంట.. ఇక చేప వీర్యం తో చేసే వంటను షిరకో’ అని పిలుస్తారు.జపాన్ ప్రజలు తినే అంత్యంత భయానకమైన.. అరుదైన వంటకం ఇది.

ఇది చూసేందుకు గుడ్డు తెల్ల సొనలా ఉంటుంది. కానీ, దాన్ని చేప వీర్యంతో తయారు చేస్తారు. ‘షిరకో’ అంటే ‘తెల్ల పిల్లలు’ అని అర్థం. దీన్ని ఎక్కువ అన్నం, పెరుగుతో కలిపి వడ్డిస్తారు. చేప వీర్యంతో తయారు చేసే వంటకం చూసేందుకు చాలా బాగుంటుందట. కానీ, టేస్ట్ మాత్రం తెలియదట. అలాంటప్పుడు అది తినడం ఎందుకు వేస్ట్ కదా అనేగా మీ సందేహం. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, B12, విటమిన్-D వల్ల చర్మానికి మేలు జరుగుతుందట. వృద్ధాప్య ఛాయలు దరిచేరవట.. అయితే చేప వీర్యాన్ని ఎలా తీస్తారు అన్నది ప్రశ్నగా మిగిలింది.

Leave a Reply

Your email address will not be published.