వామ్మో.. ఇదేం పిచ్చి రా బాబూ..

By | January 14, 2022

ఒక వైపు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుపోతుంది.. ఈ మేరకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన వినూత్న ఆలోచన అందరిని మంత్రముగ్దులను చెస్తుంది.ఇంట్లో అంటే వేడి నీటితో స్నానం చేయడం వీలవుతుంది. కానీ అదే మనం ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ కేవలం సరస్సులు, నదులు మాత్రమే ఉంటే ఆ సమయంలో వేడి నీటిని చేయడమెలాగో చాలా మందికి తెలియదు. అందుకోసమే కష్టమైనా సరే చన్నీళ్లతోనే స్నానం కానిచ్చేస్తారు. కానీ సరస్సులు, కొలనుల్లో చలికాలం పూట చన్నీళ్లతో ఎలా స్నానం చేయాలో ఓ యూజర్ చూపించాడు.

అతడు చన్నీళ్ల స్నానం చేసే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది. ఇంతకీ అతడు స్నానం చేసేందుకు ఏం ఉపయోగించాడంటే.. ఎవరికైనా సరే చలికాలం పూట చన్నీళ్ల స్నానం చేయడం కష్టంతో కూడుకున్న పనే.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ యూజర్ నదిలో స్నానం చేసే సమయంలో అతడి పక్కన ఓ గమేళాలో గడ్డితో మంటను వెలిగించాడు. ఓ సారి నదిలోకి మునిగి చలి మంట కోసం గమేళాలో వెలుగుతున్న నిప్పును ఉపయోగించుకున్నాడు.మరో సారి కూడా అతడు అలాగే చేశాడు. ఇలాగే చేస్తూ తను స్నానాన్ని పూర్తి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అనేక రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మీరు కూడా చూడండి.https://twitter.com/rupin1992/status/1480953018774261760?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1480953018774261760%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Leave a Reply

Your email address will not be published.