గుర్రం ఎక్కి రచ్చ చేసిన బాలయ్య..

By | January 15, 2022

సంక్రాంతి పండుగకు బాలయ్య చిన్నపిల్లాడిలా రచ్చ చేసాడు..కారంచేడులోని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కుటుంబం పండుగను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.నిన్న భారీగా తరలివచ్చిన అభిమానులతో కొంతసేపు మాట్లాడిన బాలకృష్ణ, ఈరోజు ఇలా గుర్రం పై కుర్చుని స్టెప్పులు వేయిస్తూ సందడి చేసారు. అనంతరం కుమారుడు మోక్షజ్ఞ కూడా గుర్రం పై సందడి చేసారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఎద్దుల బండిని నడిపిస్తూ అభిమానులను పలికరించాడు. మరోవైపు బాలకృష్ణ ను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు.. జిల్లా మొత్తం బాలయ్య పేరుతో హోరెత్తిపోయింది… మరో రెండు రోజులు బాలయ్య అక్కడే ఉంటాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published.