దొంగను పోలీసు భలే పట్టుకున్నాడు..

By | January 15, 2022

దొంగలు ఇప్పుడు పోలీసుల కళ్ళు కప్పె ప్రయత్నం చేస్తున్నారు. వారిని దెబ్బ కొట్టడం  టెక్నాలజీ ని ఉపయొగించి  నేరగాళ్ల ఆట కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా జరిగిన ఒక ఘటన పోలీసుల పై ప్రసంసలు కురిపిస్తుంది.సినిమా లెవెల్ లో ఓ పోలీసు అధికారి చేజ్ చేసి దొంగను పట్టుకున్నారు.. వివరాల్లొకి వెళితే.. ఈ అద్భుతం కర్ణాటక లో వెలుగు చూసింది.కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఒక వలస కూలీ విశ్రాంతి తీసుకుంటుండగా.. అతని ఫోన్ కొట్టేసాడో దొంగ. దీంతో సదరు బాధితుడు దొంగా అని అతణ్ణి వెంబడించాడు. అది గమనించిన పోలీస్ దొంగ వెనుక పరుగు పెట్టాడు.

దొంగను గ్యాప్ లేకుండా పులి పంజా విసిరి.. సందులు గొందులు పరిగెత్తించి మరి పట్టుకున్నారు.దొంగతనం జరిగినప్పుడు వలసకూలీ నెహ్రూ గ్రౌండ్స్ లో నిద్రపోతున్నాడని పోలీసులు తెలిపారు.. అక్కడ పట్ట పగలే దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసు చేసిన సాహసం జనాల్లొ కొత్త ధైర్యాన్ని నింపింది. ఆ దొంగను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అతణ్ణి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. అతను సెల్ ఫొన్ దొంగ అని ఒప్పుకున్నాడు…ఈ వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లొ తెగ హల్ చల్ చెస్తుంది…

Leave a Reply

Your email address will not be published.