కొడాలి నాని కన్వెన్షన్ హాల్ లో గోవా కల్చర్..

By | January 16, 2022

సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్‌ లో హోరెత్తిపోతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కన్వెన్షన్ హాల్ లో గొవాను తలపిస్తున్నాయి. పబ్ కల్చర్ లో యువత మునిగి తెలుతున్నారు. అందులోనూ బాధ్యత కలిగిన మంత్రి పదవిలో వున్న వ్యక్తికి సంబంధించిన ఒక హాల్ లో ఇలా మద్యం సేవిస్తున్నారు.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూన్నాయి.. వివరాల్లొకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి.

అంత పబ్లిక్ గా ఇలా జరగడం పై రాజకీయ విష్లెషకులు పెదవి విరుస్తున్నారు.వైసీపీ నేతలు తగ్గేదే లే అంటూ మందేసి చిందేస్తున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు, గుండాట, నంబర్ల ఆటలతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో ఏర్పాటు చేశారు. 10 వేల ప్రవేశ రుసుం చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి లభిస్తుంది. మొత్తానికి గోవాను తలిపించేలా లోపల బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినట్లు ఫోటోలను చూస్తె తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా స్పెషల్ ఎఫెక్ట్‌గా చీర్ గాళ్స్ ద్వారా నృత్య ప్రదర్శనలు సైతం ఇప్పిస్తున్నారు. తీన్ పత్తి, క్యాషియోన్, మూడు ముక్కలాటలు మరోవైపు జరుగుతున్నాయి. ప్రత్యేక లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published.