భార్యలను కొట్టిన భర్తలను మనం ఎప్పుడూ చుస్తూనె ఉంటాము.. కానీ భర్థలను కొట్టిన భార్యలను చూడటం చాలా తక్కువ.. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. భర్త మద్యానికి బానిస అయ్యి రోజూ తాగి వచ్చి కోడుతున్నాడని భార్య కీలక నిర్ణయం తీసుకుంది. అథని పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఆమె పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపొయింది.
వివరాల్లొకి వెళితే.. గిద్దలూరులోని ఏడవ వార్డులో ఈ దారుణం జరిగింది. మద్యానికి బానిసైన అంజీ అనే వ్యక్తి రోజు ఇంటికి వచ్చి తనతో గొడవ పడేవాడు. ఆ వేధింపులు తాళలేక భర్త ను రాడ్డు తో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించింది. దాంతో అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగి పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.