భార్య ఆ వీడియో చూసి చలించిన భర్త చివరికి..

By | January 17, 2022

భార్య ప్రైవసి వీడియో ను చూసిన భర్త భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.భర్త తన భార్య వేరే వ్యక్తితో అసభ్యకరంగా ఉన్న దృష్యాలు సోషల్‌మీడియాలో చూడటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.వంగలపూడికి చెందిన 30 ఏళ్ల మహిళ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లింది. ఆమె భర్త గోకవరంలో ఉంటుండంగా, వారి ఇద్దరు కుమారులు, కుమార్తె అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నారు. తండ్రి అప్పుడప్పుడు పిల్లలను చూడటానికి అక్కడి వచ్చి వెళ్తుంటాడు. మొన్న సాయంత్రం వంగలపూడికి వచ్చిన తండ్రి.. తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు.

అక్కడే తాను ఎలుకల మందు తాగాడు. ఆ తర్వాత తన ముగ్గురు పిల్లలకు తాగించే ప్రయత్నం చేయగా.. 10 ఏళ్ల కొడుకు మందు తాగేశాడు. అప్పటికే తండ్రి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో ఆ ఇద్దరు పిల్లలు విషం తాగలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఓ ఆస్పత్రిలో చేర్చించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

Leave a Reply

Your email address will not be published.