పానీపూరి కోసం పోలీసు స్టేషన్ ఎక్కాడు..

By | January 17, 2022

కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అయినా పానీపూరికి డిమాండ్ మాత్రం తగ్గలేదు.ఈ పానీపూరి రుచిని మాత్రమే కాదు.. గొడవలను కూడా పెడుతోంది.  ఇప్పుడు కూడా పానిపూరి గొడవ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఓ వ్యక్తి పానిపూరి రుచిగా లేదని నిర్వాహకుడు తో ఘర్షనకు దిగాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన అనంతపురంలో వెలుగు చూసింది.పోలీసు కాంప్లెక్స్‌లో రాణి అనే మహిళ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు.

బెంగళూరులో ఎంబీబీఎస్‌ చదువుతున్న రాంనగర్‌ నివాసి వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తి పానీపూరి తినడానికి వచ్చాడు. తమ్ముడి తో కలిసి వచ్చి రాణి దగ్గర పానిపూరి తిన్నారు.తిన్న తర్వాత రుచి బాగోలేదని తన అభిప్రాయాన్ని ఆ యువకుడు వ్యక్తం చేశాడు. అది నచ్చని ఆమె అతనితో గొడవకు దిగింది. ఇద్దరు మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఈ సమయంలో అక్కడున్న వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చెరుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు..

Leave a Reply

Your email address will not be published.