ధనుష్ విడాకుల పై ఆర్జీవి కామెంట్స్..

By | January 18, 2022

సినీ పరిశ్రమలో విడాకుల పరంపర మొదలు అవుతుంది. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకున్నారు..తమిళ స్టార్ హీరో ధనుష్‌, సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు నిర్మాత ఐశ్వర్య జంట విడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సోమ వారం రాత్రి అధికారికంగా ప్రకటించారు..ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.

ఇది ఇలా ఉండగా..వీరిద్దరి విడాకులపై టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన స్టైల్‌ లో స్పందించారు. పెళ్లి అంటేనే ఓ జైలు అంటూ ఓ ట్వీట్ చేశారు వర్మ. ” ధనుష్‌ లాంటి చాలా మంది ప్రముఖులు.. విడాకులు ఇచ్చి.. యువతను కాపాడుతున్నారు. పెళ్లి అంటేనే ఓ జైలు. పెళ్లి చేసుకునే బదులు… ఎప్పటికీ ప్రేమించుకుంటునే ఉండాలి. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా మనం ఉన్నంత వరకు ప్రేమించుకుంటూ వెళ్లడమే ఆనంద రహస్యం.” అంటూ RGV సంచలన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Leave a Reply

Your email address will not be published.