మరోసారి బయటపడ్డ వారంటీర్ భాగోతం..

By | January 18, 2022

వాలంటీర్ వక్ర బుద్ది బయట పడింది.. చాలా మంది యువతులు ఇలాంటి వాళ్ళ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరో ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ దారుణ ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. యువతి ఇంట్లోకి చొరబడి అసభ్యంగా వ్యవహరించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ గ్రామ వాలంటీర్.

కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం కొండపల్లి పుట్లమ్మగట్టులో వాలంటీర్ నాగేంద్ర ఓ యువతి ఇంట్లో చొరబడ్డాడు.అతడు అసభ్య చేష్టలను గమనించిన యువతి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి వాలంటీర్ ను పట్టుకుని బంధించారు. పెళ్లీడు యువతితో అసభ్యంగా వ్యవహరించిన నాగేంద్రను శిక్షించాలని, అంతేకాదు అతని వల్ల యువతికి తీవ్ర అన్యాయాన్ని  జరిగిందని, వెంటనే న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అతని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి రిమాండ్ కు తరలించారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published.