ఆడవారికి సువర్ణవకాశం… భారీ తగ్గిన బంగారం వెండి ధరలు..!!

By | January 20, 2022

బంగారం ధరలు వెలవెలబోయింది.. నిన్నటి రోజున బాగా నిలకడగా కొనసాగిన బంగారం ధర రేటు ఈరోజు మాత్రం స్వల్పంగా తగ్గిందని చెప్పవచ్చు.. పసిడి ప్రేమికులకు ఇది కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవాలి. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం మెరిసిపోతోంది.. వెండి ధర పైపైకి కదులుతోంది. మరొకవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా రేట్లు కాస్త కదిలాయి అని చెప్పవచ్చు.. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం తగ్గింది..

హైదరాబాద్లో మార్కెట్లో బుధవారం బంగారం ధర కాస్త తగ్గింది..10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.20 క్షీణించింది.. దీంతో బంగారం ధర రూ.49,070 కు తగ్గింది. ఇక అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఇదే దారిలో నడిచింది. రూ.20 క్షీణించింది. దీంతో ఈ పసిడి ధర రేటు రూ.44,970 రూపాయలకు చేరుకుంది.

బంగారం ధర కాస్త తగ్గగానే.. వెండి రేటు మాత్రం జిగేల్ మంటూ మెరిసిపోతోంది.. వెండి కేజీ ధర పై .. రూ.300 పెరిగి..రూ.65,800  చేరింది.. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి ధర ఈరోజుకి కాస్త పైకి ఎగబాకడం గమనార్హం. ఇక మరొకవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారు ధరలు జిగేల్ మంటున్నాయి.. పసిడి రేటు పెరిగింది.. దీంతో పసిడి రేటు ..1812 డాలర్లు చేరింది. వెండి రేటు ధర మాత్రం 23.49 డాలర్లకు క్షీణించింది. కాగా గోల్డ్ రేటు పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి..

ముఖ్యంగా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలలో మార్పు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, అందులో వాటి వడ్డీ రేట్లు, వాణిజ్యం, వంటి పలు అంశాల వల్ల పసిడి రేటుపై ప్రభావం చూపుతోందని గమనించాలి. ఇకపోతే బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జిఎస్టి, ఇతర పనుల్లో తమ చార్జీలు అంటే జత చేయలేదు. పూర్తిగా తెలియాలంటే మీరు రిటైల్ షాప్ కి వెళ్లి రేట్లను చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published.