కూతురితో కలిసి డాన్స్ కుమ్మేసిన లయ..!

By | January 20, 2022

ఒకప్పుడు తెలుగు తెరపై హీరోయిన్‌గా తన సత్తా చాటిన లయ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైన విషయం అందరికి తెలిసిందే. తెలుగు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పెద్ద హీరోలందరి సరసన ఆమె నటించింది. ప్రేమించు సినిమాలో అంధురాలిగా నటించి నంది అవార్డుతో పాటు ఎందరో ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది.

లయ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిన లయ తన కెరియర్ టాప్ లో ఉన్నపుడే పెళ్లి చేసుకుందట.పెళ్లి అనంతరం దాదాపు పదేళ్ల తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసారట లయ.ఈ సినిమాలో లయ కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించడం గమనార్హం.కాగా క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా లయ తన కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది.

కూతురుతో కలిసి లయ వేసిన స్టెప్పులు తన అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నటి లయ.. సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు ఎప్పుడూ కూడా టచ్ లోనే ఉంటూ ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించి ఫోటలను అభిమానులకు పంచుకుంటూనే ఉంటుంది.స్వయంవరం సినిమాతో తెలుగు చిత్రప్రశ్రమకి పరిచయం అయిందట హీరోయిన్ లయ..

ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లయ. అయితే ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జగపతిబాబు భార్యగా లయని సంప్రదించారట దర్శకుడు త్రివిక్రమ్.. కానీ అప్పుడే వదిన అమ్మ పాత్రలు చేసందుకు ఇష్టం లేదని  ఆ పాత్రలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట లయ.. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ఇక ఆ పాత్రకు నటి ఈశ్వరీ రావును తీసుకున్నాడట త్రివిక్రమ్.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించిన విషయం అందరకు తెలిసిందే..

Leave a Reply

Your email address will not be published.