కిడ్నీ ఇచ్చాడు… చివరికి ప్రియురాలు చేసిన పనికి..

By | January 20, 2022

నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది.. ఈరోజుల్లో అలాంటి ప్రేమ కథలు ఎక్కడా లేవు.. అది మాత్రం అందరూ చెబుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మంచి హృదయాన్ని ఛాటుకున్నాడు.. అమ్మాయి వాళ్ళ అమ్మకు కిడ్నీ ఫైయిల్ అయితే అతను ఉదార స్వభావం తో ఆమెకు కు తన కిడ్నీ ఇచ్చాడు. అది కూడా ఆ మహాతల్లి మర్చిపోయి.. తనను రిజెక్ట్ చేసింది. అది కూడా ఆ వ్యక్తి బాధపడలేదు. నిజంగా ఈరోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉండటం గ్రేట్ అనే చెప్పాలి. ఈ బాధాకరమైన ఘటన మెక్సికోలో వెలుగు చూసింది.మెక్సికోలో టీచర్‌గా పనిచేసే ఉజియెల్ మార్టినెజ్‌ది ఈ బాధాకరమైన ఘటన..

అతను తన ప్రాణం కన్నా ఎక్కువగా ఒక అమ్మాయిని ప్రెమించాడు. ఆమె తో చాలా రోజులు బాగానే వున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఆమె తల్లికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దాంతో భాధపడిన అతను..తన కిడ్నీకి గర్ల్‌ఫ్రెండ్ తల్లికి దానం చేశాడు. ఆ తర్వాత నెలతిరిగేసరికే గర్ల్‌ఫ్రెండ్ అతనికి షాకిచ్చింది. మార్టినెజ్‌కు బ్రేకప్ చెప్పేసి ఎంచక్కా వేరే వ్యక్తిని పెళ్లాడింది. ఇటీవల టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న ఒక ఛాలెంజ్‌లో భాగంగా తన అనుభవాన్ని మార్టినెజ్ వెల్లడించాడు.

Leave a Reply

Your email address will not be published.