పశ్చిమ గోదావరి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. ఇటీవల ఎన్నో ఘటనలు వెలుగు చూసాయి.. ఇప్పుడు కూడా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.పంగిడిగూడెం పంచాయతీ సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం, నల్లజర్ల, రాజమండ్రిలకు చెందిన కొంత మంది యువకులు తమ బైక్‌లపై పొలసానిపల్లిలోని ఓ తోటలోకి రాత్రి చేరుకోగా, మరో కారులో ముగ్గురు యువతులు వచ్చారు. మద్యం మత్తులో ఐటెంసాంగ్స్‌తో అర్ధనగ్నంగా ఉన్న యువతులతో అరుపులు, కేకలతో యువకులు చిందులేశారు. దీంతో ఆ ప్రాంతం హోరెత్తింది.
స్థానికుల సమాచారంతో ఎస్సై వీఎస్వీ భద్రరావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువతులు, యువకులు చిందులేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి అచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.తాగి అర్ధనగ్నంగా ఉన్న ముగ్గురు యువతులు, ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక కారు, ఆరు సెల్ఫోన్లు, ఐదు మోటార్‌సైకిళ్లు, సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.