పెద్ద మనసు ఛాటుకున్న మహేష్..!

By | January 21, 2022

మహేష్ బాబు సినిమాలనే కాదు.. పేదలకు సాయం చెయ్యడం లో కూడా ముందు ఉంటాడు.. ఈ విషయం పై గతంలో కూడా చాలా మందికి తానూ సాయాన్ని అందించారు.. ఇప్పుడు కూడా మరోసారి తన వంతు సాయాన్ని అందించి పెద్ద మనసు ఛాటుకున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. దాని ద్వారా ఇప్పటి వరకు 1050 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్‌ చేయించి.. పేద పిల్లల పాలిట దైవంగా మారారు.

తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేశ్‌. ఈ విషయాన్ని మహేశ్‌ బాబు సతీమణి నమ్రత సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. సహస్ర అనే ఒక సంవత్సరం పాపకి కావాల్సినవి సమకూర్చి ఆంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించారని, ప్రస్తుతం ఆ పాప క్షేమంగా ఉందని తెలిపారు నమ్రత. దీంతో ప్రేక్షకులు, అభిమానులు మహేశ్‌ బాబుపై ప్రశంసల కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.