సామ్, చైతు మళ్ళీ కలవనున్నారా?

By | January 21, 2022

సామ్, చైతన్య కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్నారనె వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి..చివరికి ఆ వార్తలనే నిజం చేస్తూ చై, సామ్ మేము విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటి నుంచి సమంత ప్రతి చిన్న విషయంలోను వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

కాగా, తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటన పోస్టును తొలిగించండం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సామ్ ఎందుకు ఆ పోస్ట్ డిలీట్ చేసింది. వీరు మళ్లీ కలుస్తున్నారేమో, అందుకే సమంత ఆ పోస్ట్ డిలీట్ చేసిందంటూ నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ మరోవైపు నాగ చైతన్య మాత్రం ఇంకా ఆ పోస్ట్ అలానే ఉంచారు. సమంత, నాగచైతన్యతో కలిసి పోవాలనుకుంటోంది అందుకే ఆ పోస్ట్ డిలీట్ చేసిందని కొందరు ముచ్చటిస్తున్నారు. కానీ చైతూ కూడా ఆపోస్ట్ డిలీట్ చేయాలిగా అలా ఎందుకు జరగలే, లేక సమంత నార్మల్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌ను క్లీన్ చేసే ప్రాసెస్‌లో విడాకుల ప్రకటన నోట్‌ను డిలీట్ చేసిందేమో అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ వార్త పై సామ్ ఒక క్లారిటీ ఇవ్వాల్సిందె..

Leave a Reply

Your email address will not be published.