భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి.. చివరికి అలా..

By | January 22, 2022

ప్రెమించి పెద్దలను ఎదురించి పెళ్ళి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా కలిసి కాపురం చేశారు. తర్వాత వారి పచ్చని సంసారంలోకి అక్రమ సంబంధం ఎంట్రీ ఇచ్చింది. భర్త ఉండగానే వేరొకరి మోజులో పడింది. దానికోసం అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలగించుకొవాలని నిద్ర మాత్రలను ఇచ్చింది.గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.పొన్నూరు పట్టణానికి చెందిన జయచిత్ర నాగరాజు.. నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సోని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరికి ఇద్దరు పిల్లలు. ఆరు సంవత్సరాల క్రితం నాగరాజు కుటుంబంతో సహా పొన్నూరులో స్థిరపడ్డాడు. అనుకొని రీతిలో నాగరాజు మాయ మయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కొనాల్లొ దర్యాప్తును ప్రారంభించారు..సోనీకి స్థానికంగా ఉండే వెంకటసాయి అనే యువకుడితో పరిచయమైంది.అది కాస్త శారీరక సంబంధంగా మారింది.భార్య విషయం నాగరాజుకు తెలిసి మందలించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య అడ్డు తొలగించుకొవాలని నిద్ర మాత్రలను భోజనం లో కలిపి ఇచ్చింది..ఆ తర్వాత కాలువలో పడేసింది.. పోలీసుల విచారణ లో నిజాన్ని ఒప్పుకుంది..  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Leave a Reply

Your email address will not be published.