భామా కలాపం టీజర్ లో హైలెట్స్ ఇవే..

By | January 23, 2022

భామా కలాపం పేరుతో మరో కొత్త సినిమాను తీసుకొస్తోంది. చాలా కాలం తర్వాత ప్రియమణి ప్రధాన పాత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా త్వరలోనే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.. సినిమా మొదలైనప్పుడు నుంచి ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి..అభిమాన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి ఆహా లో రానుంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. దాంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించారు..

తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. 1.29 నిమిషం నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ప్రియమణి అనుపమ అనే హౌజ్ వైఫ్ పాత్రలో కనిపిస్తోంది. పొరిగిళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆతృత చూపించే మహిళ పాత్రలో ప్రియమణి ఆకట్టుకుంది. అక్కడ ఆ హత్య జరుగుతుంది. ఆ హత్య ఎలా జరుగుతుంది అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఆ మర్డర్‌కి, అనుపమకు సంబంధం ఏంటి.. అసలు కథ ఏంటి? దీని వల్ల అనుపమ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్న కథాంశాన్ని ఇతివృత్తంగా తెరకెక్కించారు..డేంజర్ వైఫ్ పాత్రలో ప్రియమణి ఎలా కనిపిస్తుంది అనేది ఆసక్తిగా మారింది..

Leave a Reply

Your email address will not be published.