లుంగీ వల్ల ప్రాణాలును కోల్పోయిన దొంగ..

By | January 23, 2022

దొంగ అర్దరాత్రి వెళ్లాడు.. వెళ్ళి గేట్ దుకెందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతని లుంగీ మెడకు బిగుసుకొని యమపాసంగా మారింది.ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది.. ఇది ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది..వివరాల్లొకి వెళితే..నగరంలోని బార్కస్‌ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌ బిన్‌ అలీ జైదీ మద్యానికి బానిసై తరచూ దొంగతనాలు చేస్తుండేవాడు.. శనివారం రాత్రి కూడా ఆయన దొంగతనం చేయడానికి వెళ్ళాడు.

సలాలా పీలిదర్గా రోడ్డులో ఉన్న పాత మోటారు పార్ట్స్ గోదాంలో చోరీకి వెళ్లాడు. అక్కడ పెద్ద గెట్ ఉంది. ఆ గెట్ ను దుకే ప్రయత్నాలు చేసాడు. ఈ క్రమంలో అతను కట్టుకున్న లుంగీ గేటుకు చిక్కుకుంది. నడుం వద్ద లుంగీ ముడివేసి ఉండటంతో అది పొట్ట, ఛాతీ భాగం దగ్గర చుట్టుకుపోయింది. మొత్తం గొంతును పట్టేసింది. దాంతో చాలా సేపు పోరాడాడు. చివరికి శ్వాస ఆడక ప్రానాలను కోల్పోయాడు.గోదాం సిబ్బంది అక్కడి వెళ్లినప్పుడు గేటుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు..

Leave a Reply

Your email address will not be published.